: పాప్ గాయకుడు జస్టిన్ బీబర్ అరెస్టు
సంచలన కెనడియన్ పాప్ గాయకుడు, నటుడు, మ్యుజిషియన్ జస్టిన్ బీబర్ ను మియామి బీచ్ స్ట్రీట్ లో స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం సేవించి కారు నడిపాడన్న అనుమానంతోనే అతడిని అరెస్టు చేసినట్లు బీబీసీ టీవీ పేర్కొంది. బీబర్ వేరే వ్యక్తితో కలసి కారు నడుపుతుండగా చూసిన ప్రత్యక్ష సాక్షి వెల్లడించడంతో ఈ చర్యలు తీసుకున్నారు.