: అమెరికాలో ప్రతి ఐదో మహిళపై అత్యాచారం జరుగుతోంది
అమెరికాలో మహిళలకు రక్షణ బాగుంటుందని అనుకుంటాం. కానీ, అక్కడ ప్రతి ఐదుగురిలో ఒకరు తమ జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా అత్యాచారానికి గురై ఉంటారట. బాధితుల్లో కనీసం సగం మంది 18 ఏళ్ల వయస్సులోపే లైంగిక దాడికి గురవుతున్నారని వైట్ హౌస్ విడుదల చేసిన ఓ నివేదిక పేర్కొంది. లైంగికదాడులకు గురవుతున్న వారిలో అమెరికన్- భారతీయులు, అలాస్కా వారిలో 27 శాతం మంది, హిస్పానిక్ తెగలలో 15శాతం, నల్లజాతి వారిలో 22 శాతం, శ్వేత జాతీయుల్లో 19 శాతం మంది ఉంటున్నారు.