: బేగంపేటలో బోర్డు తిప్పేసిన సాఫ్ట్ వేర్ కంపెనీ
హైదరాబాదులో మరో సాఫ్ట్ వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. బేగంపేటలోని క్రోనియన్ సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పత్తా లేకుండా పోయింది. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ 300 మంది నుంచి 30 కోట్ల రూపాయలు వసూలు చేసింది. జరిగిన మోసాన్ని గుర్తించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.