: లైంగిక వేధింపులను అరికట్టేందుకు అమెరికా ప్రత్యేక టాస్క్ ఫోర్స్


లైంగిక వేధింపులపై పోరాటానికి, వ్యక్తుల రక్షణకు ప్రత్యేక 'వైట్ హౌస్ టాస్క్ ఫోర్స్'ను ఏర్పాటు చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రకటించారు. ఈ ఫోర్స్ తో, తాము దేశంలోని కళాశాలలు, యూనివర్శిటీలు, విద్యా సంస్థల్లాంటి వాటికన్నిటికీ సహాయం చేయనున్నట్లు చెప్పారు. దానివల్ల లైంగిక దాడులను అరికట్టవచ్చని నిన్న(బుధవారం) జరిగిన క్యాబినెట్ లెవల్ మీటింగ్ లో ఒబామా పేర్కొన్నారు. ముఖ్యంగా కళాశాలల విద్యార్థిని, విద్యార్థులపై జరుగుతున్న భౌతిక దాడులు చాలా బాధాకరమన్నారు. అంతేగాక ఒక వ్యక్తిపై నేరం కంటే లైంగిక హింస దారుణమని, ఇలాంటివి అందరి కుటుంబాలను చాలా బాధిస్తాయని... వాటివల్ల దేశం మొత్తానికి చాలా ఇబ్బంది ఎదురవుతుందని వివరించారు.

  • Loading...

More Telugu News