: బీఏసీ సమావేశం కోసం వాయిదా పడ్డ శాసనసభ
టీబిల్లుపై చర్చ కోసం గడువును వారం రోజుల పాటు పొడిగించిన రాష్ట్రపతి ఆదేశాలు అసెంబ్లీకి చేరాయి. ఈ వివరాలను అసెంబ్లీ కార్యదర్శి శాసనసభలో చదివి వినిపించారు. దీంతో గడువు పొడిగింపుపై బీఏసీ (శాసనసభ వ్యవహారాల సంఘం)లో చర్చించేందుకు స్పీకర్ నాదెండ్ల మనోహర్ సభను వాయిదా వేశారు. వారం రోజుల పాటు చర్చను ఎలా కొనసాగించాలనే విషయమై బీఏసీలో చర్చించనున్నారు. బీఏసీ సమావేశానంతరం సభ తిరిగి ప్రారంభమవుతుంది.