: ప్రారంభమైన అక్కినేని అంత్యక్రియలు.. రోదించిన నాగార్జున...
బహుదూరపు బాటసారి అక్కినేని నాగేశ్వరరావు అంత్యక్రియలు అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రారంభమయ్యాయి. ఆయన పాడెను కుమారుడు నాగార్జున, మనవళ్లు సుమంత్, సుషాంత్, నాగ చైతన్య, అఖిల్ మోశారు. మరో నటుడు కృష్ణంరాజు కూడా కాసేపు పాడెను మోసి, పాడెతో పాటే నడిచారు. ఈ సందర్భంలో నాగార్జున ఉద్వేగాన్ని ఆపుకోలేక రోదించారు.