: 'మోడీ ప్రధాని అవుతారా?' అనడిగిన జర్నలిస్టుకు చెంపదెబ్బ!


బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీని ప్రకటించినప్పటి నుంచి రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఆయన ప్రధాని అవుతారా? లేదా? అనేది అందరి అనుమానం. ముఖ్యంగా మీడియాలో ఈ ఊహాగానాలు ఎక్కువగా వున్నాయి. ఈ ఆలోచనతోనే ఆంగ్ల చానల్ కు చెందిన ఓ జర్నలిస్టు.. మోడీ ప్రధాని అవుతారా? అని మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో.. ద్వారకా పీఠం శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి జీ మహారాజ్ ను ప్రశ్నించారు. అందుకు ఆగ్రహించిన ఆయన వెంటనే జర్నలిస్టును చెంపపై కొట్టారు. అనంతరం శంకరాచార్య మాట్లాడుతూ, అతను ఓ పనికిరాని ప్రశ్నను అడిగాడని అన్నారు. అయితే, రాజకీయాలపై మాట్లాడాలని తనకు లేదన్నారు.

  • Loading...

More Telugu News