: బీహార్ కోసం నితీశ్ ఢిల్లీలో ర్యాలీ
బీహార్ కు ప్రత్యేక హోదా కల్పిస్తూ నిధులు విడుదల చేయాలనే డిమాండ్ తో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఢిల్లీలో నేడు ర్యాలీ నిర్వహిస్తున్నారు. ర్యాలీ అనంతరం రామ్ లీల మైదానం వద్ద ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇందుకోసం సుమారు 60వేల మందికిపైనే ప్రజలు హాజరవుతారని భావిస్తున్నారు.
జనతాదళ్ యునైటెడ్ అధ్యక్షుడు శరద్ యాదవ్ మాట్లాడుతూ బీహార్ రాష్ట్ర విభజన అసమగ్రంగా జరిగిందని, నాడు బీహార్ కు అన్నివిధాల సాయం అందిస్తామన్న హామీ అమలు కాలేదన్నారు. ప్రత్యేక హోదా, నిధుల కోసం గతేడాది నవంబర్ 4న కూడా పాట్నాలో ర్యాలీ నిర్వహించామని గుర్తు చేశారు. మొత్తానికి ఈ ర్యాలీ ద్వారా కేంద్రాన్ని దిగొచ్చేలా చేయాలని జేడీ యూ నేతల యత్నం.

అయితే ఈ ర్యాలీ ద్వారా నితీశ్ కుమార్ జాతీయ రాజకీయాలలో తన ప్రవేశానికి మార్గం సుగమం చేసుకోవాలని యోచిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అటు బీహార్ కు ప్రత్యేక హోదాతో పాటు ఇటు మోడీకి దీటుగా తనను కూడా జాతీయంగా ప్రమోట్ చేసుకునే వ్యూహం ఇందులో దాగుందని అంటున్నారు.