: ప్రజల్లో విద్వేషం రేకెత్తగూడదని నేను భావిస్తున్నాను: సీఎం
తాను శాసనసభలో వెల్లడిస్తున్న వివరాలన్నీ వాస్తవమైనవని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ, టీఆర్ఎస్ విభజన అంటుండగా మిగిలిన అందరూ సమైక్యమనే అంటున్నారని అన్నారు. ప్రజల్లో విద్వేషాలు రేకెత్తగూడదని, తాను వాస్తవాలు వెల్లడిస్తున్నానని ఆయన తెలిపారు. రాజకీయ ఒత్తిళ్లు తీవ్రంగా ఉండే సాగునీరును రాష్ట్రం మొత్తానికి పంచడానికి నాయకత్వం ప్రతిక్షణం తపిస్తుందని అన్నారు. రెండు రాష్ట్రాలైతే నీరును కేంద్రం పంపిణీ చేయడానికి కుదరదని, రాష్ట్రాలకు అధికారం ఉండదని సీఎం స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాలకు మధ్యన నీరు ప్రవహిస్తుందని ఆయన గుర్తు చేశారు. విద్యత్ పంపిణీ కూడా ఇప్పటిలాగా కుదరదని చెప్పారు.