: ముంబై దాడి కేసు విచారణను వాయిదా వేసిన పాక్ కోర్టు
2008 నవంబర్ లో ముంబైలో ముష్కరులు సాగించిన మారణకాండ కేసు విచారణను పాక్ కోర్టు ఈ నెల 29కి వాయిదా వేసింది. లష్కరే తాయిబా కమాండర్ జకీఉర్ రెహ్మాన్ లఖ్వి సహా ఏడుగురు నిందితులు విచారణను ఎదుర్కొంటున్నారు. నిందితుల్లో ఒకరు బ్యాంకు లావాదేవీలు జరిపినట్లు ముస్లిం కమర్షియల్ బ్యాంకు అధికారి ఒకరు తీవ్రవాద వ్యతిరేక కోర్టులో సాక్ష్యం చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మరింత మంది సాక్ష్యులను విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తూ కోర్టు సమన్లు జారీ చేసింది.