: స్విస్ మహిళపై అత్యాచారం కేసులో ముగ్గురి అరెస్ట్
స్విట్జర్లాండ్ మహిళపై సామూహిక అత్యాచారం కేసులో మధ్యప్రదేశ్ లోని దాతియా పట్టణ పోలీసులు ముగ్గురిని ఈ ఉదయం అరెస్ట్ చేశారు. ఇదే కేసులో పోలీసులు నిన్న 14 మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తన భర్తతో కలిసి మధ్యప్రదేశ్ నుంచి ఆగ్రా వరకూ సైకిల్ యాత్రగా వెళుతున్న స్విస్ మహిళపై శుక్రవారం రాత్రి దాతియా జిల్లాలో కొందరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
దంపతుల దగ్గర విలువైన వస్తువులు, నగదును కూడా దోచుకున్నారు. దీనిపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ కేసులో వేగంగా దర్యాప్తు జరిపి తమ దేశ పౌరురాలికి న్యాయం చేయాలని స్విస్ ప్రభుత్వం భారత్ ను కోరింది.
దంపతుల దగ్గర విలువైన వస్తువులు, నగదును కూడా దోచుకున్నారు. దీనిపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ కేసులో వేగంగా దర్యాప్తు జరిపి తమ దేశ పౌరురాలికి న్యాయం చేయాలని స్విస్ ప్రభుత్వం భారత్ ను కోరింది.