: రాష్ట్రం వస్తే వేలాది ఉద్యోగాలు వస్తాయని భావిస్తున్నాం: సీపీఐ చంద్రావతి
ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే ఈ ప్రాంత యువతకు వేలాది ఉద్యోగాలు వస్తాయన్న ఆశాభావంతో ఉన్నామని సీపీఐ సభ్యురాలు చంద్రావతి పేర్కొన్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లుపై గురువారం ఆమె శాసనసభలో మాట్లాడారు. గతంలో తెలంగాణకు మద్దతు పలికిన వారు నేడు యు-టర్న్ తీసుకున్నారని విమర్శించారు. తెలంగాణ పోరాటం ఒక ప్రజా ఉద్యమమని ఆమె అన్నారు. శాసనసభకు వచ్చిన ఈ బిల్లును మనసారా స్వాగతిస్తున్నామని ఆమె అన్నారు.