: విభజన బిల్లుపై చర్చ ముగిశాక కాంగ్రెస్ కు సీఎం కిరణ్ గుడ్ బై?
అందరూ ఊహించింది.. శంకించిందే నిజమవనున్నదా? ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ నుంచి విశ్రమించనున్నారా? ఆయన కొత్త పార్టీ పెట్టడం ఖాయమేనా? ప్రముఖ జాతీయ మీడియా సంస్థ సీఎన్ఎన్ ఐబీఎన్ ముఖ్యమంత్రి కిరణ్ సన్నిహిత వర్గాలను ఉటంకిస్తూ ఇదే విషయాన్ని పేర్కొంది. శాసనసభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013 ముసాయిదాపై చర్చ ముగిశాక సీఎం కిరణ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, సొంత పార్టీ పెట్టనున్నారని ఆ కథనంలో పేర్కొంది.