: లోక్ సభ ఎన్నికల్లో మోడీ సునామీ
లోక్ సభ ఎన్నికల్లో మోడీగాలి బలంగా వీచే పరిస్థితులు కన్పిస్తున్నాయి. లోక్ మత్, ఐబీఎన్ నిర్వహించిన సర్వేలో మోడీ నేతృత్వంలోని బీజేపీ, దాని మిత్రపక్షాలు గణనీయమైన స్థానాలు సొంతం చేసుకోనున్నాయని వెల్లడైంది. సర్వే ఫలితాలు ఇలా ఉన్నాయి. మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో బీజేపీ 20 నుంచి 25 స్థానాలను సొంతం చేసుకుంటుంది. కాంగ్రెస్ కు 1 నుంచి 4 స్థానాల వరకే దక్కుతాయి. మహారాష్ట్రలో బీజేపీ, శివసేన రెండింటికీ కలిపి 25 నుంచి 33 స్థానాల వరకు లభిస్తాయి. కాంగ్రెస్, ఎన్సీపీ భాగస్వామ్యానికి 12 నుంచి 20 స్థానాల్లోపు వచ్చే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్ లో బీజేపీ 23 నుంచి 27 స్థానాలు లభించనున్నాయి. కాంగ్రెస్ 2 నుంచి 5 స్థానాల్లోపే పరిమితమవుతుంది. బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లోనూ ఎక్కువ స్థానాలు బీజేపీకే దక్కనున్నాయని ఇదే సర్వే రెండు రోజుల క్రితం వెల్లడించింది. అలాగే, పశ్చిమబెంగాల్లో తృణమూల్, ఒడిశాలో బీజేడీ ముందంజలో ఉంటాయని సర్వే పేర్కొంది.