: మంత్రి బాలరాజు, టీఆర్ఎస్ మధ్య ఒప్పందం: ధూళిపాళ్ల
రాష్ట్ర మంత్రి బాలరాజు, టీఆర్ఎస్ పార్టీల మధ్య కుట్రపూరిత ఒప్పందం ఉందని... అందుకే బాలరాజు సీమాంధ్రకు అన్యాయం చేస్తుంటే టీఆర్ఎస్ ఆయనకు మద్దతు పలుకుతోందని టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. ఈ రోజు ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. ఇదే సమయంలో ఆయన వైఎస్సార్సీపీపై కూడా విరుచుకుపడ్డారు. వైకాపా సభ్యులు సభలో ఉండాల్సింది పోయి... పారిపోతూ సమైక్యవాదం వినిపిస్తూ... సీమాంధ్రులను మోసం చేస్తున్నారని విమర్శించారు.