: నేడు ప్రభుత్వ లాంఛనాలతో అక్కినేని అంత్యక్రియలు
నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు అంత్యక్రియలు ఈ రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతాయి. అభిమానుల సందర్శనార్ధం ఆయన పార్థివ దేహాన్ని ఈ ఉదయం 7.00 గంటల నుంచి 11.00 గంటలవరకు అన్నపూర్ణ స్టూడియోస్ లో ఉంచుతారు. అనంతరం ఫిల్మ్ చాంబర్ నుంచి 12.00 గంటలకు అంతిమ యాత్ర ప్రారంభమై ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్, తెలంగాణ భవన్, ఫిల్మ్ నగర్, జుబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మీదుగా అన్నపూర్ణ స్టూడియోకు చేరుకుంటుంది.