: గురువారం ఉదయం 11 గంటలకు అక్కినేని అంతిమ యాత్ర
గురువారం ఉదయం 11 గంటలకు అలనాటి మేటి నటుడు అక్కినేని నాగేశ్వరరావు అంతిమ యాత్ర అన్నపూర్ణ స్టూడియో నుంచి ప్రారంభమవుతుందని అక్కినేని కుటుంబ సభ్యులు తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్, తెలంగాణ భవన్, ఎమ్మెల్యే కాలనీ, ఫిల్మ్ నగర్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మీదుగా అంతియ యాత్ర అన్నపూర్ణ స్టూడియోకు చేరుకుంటుందని వారు తెలిపారు. అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని అంత్యక్రియలు అధికార లాంచనాలతో గురువారం సాయంత్రం 5 గంటలకు జరుగుతాయని వారు పేర్కొన్నారు.