: మూడు ప్రాంతాల్లో ఎంత అభివృద్ధి జరిగిందో చెప్పాల్సిందే: సీఎం కిరణ్
నీటి సౌకర్యాల పరంగా తెలంగాణ, ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాల్లో ఎంత అభివృద్ధి జరిగిందో చెప్పాల్సిన అవసరం ఉందని సీఎం కిరణ్ తెలిపారు. శాసనసభలో మాట్లాడుతూ నల్గొండ, గుంటూరు జిల్లాల ప్రజలు త్యాగాలకు పూనుకోబట్టే నాగార్జునసాగర్ ప్రాజెక్టు కట్టుకోగలిగామని ఆయన అన్నారు. శ్రీరాంసాగర్ కోసం మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు త్యాగం చేయడం వల్లే ప్రాజెక్టు సాధ్యమైందని చెప్పారు. పులిచింతలకు భూకేటాయింపుల సందర్భంగా మరింతమంది త్యాగం చేశారని ఆయన గుర్తుచేశారు. సభను రేపటికి వాయిదా వేయాలనుకుంటే తనకు అభ్యంతరం లేదని, అయితే.. తాను ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు. తన మనసులో ఏ విధమైన కుట్రలు లేవని ఆయన చెప్పారు. దీనిపై తెలంగాణ ప్రాంతం వారికి తనపై ఏవైనా అపోహలు ఉంటే తీసేయాలని ఆయన సభ్యులకు సూచించారు.