: కలిసున్నాం కాబట్టే.. సంక్షేమ కార్యక్రమాలను సమర్థంగా అమలుచేయగలిగాం: సీఎం కిరణ్
రాష్ట్రంలో ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాల వివరాలను ముఖ్యమంత్రి సభలో సభ్యులకు తెలియజేశారు. డ్వాకా మహిళలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 125 కోట్ల రూపాయలను వడ్డీ రూపేణా చెల్లించామని ముఖ్యమంత్రి కిరణ్ శాసనసభలో ప్రకటించారు. రైతులకు ఇప్పటికే 550 కోట్ల రూపాయలను అందజేశామని, ఈ ఏడాది చివరికి మొత్తం వెయ్యి కోట్ల రూపాయలను అన్నదాతలకు అందజేయనున్నట్లు సీఎం కిరణ్ సభలో చెప్పారు. వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు 8,850 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆర్థిక వనరులు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నందునే పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలుచేయగలుగుతున్నామని ఆయన సభ్యులకు తెలిపారు.