: తెలంగాణలోనే కాదు, సీమాంధ్రలోనూ ఇతరులు ఉద్యోగాలు చేశారు: సీఎం కిరణ్


రాష్ట్ర ఏర్పాటు నాటికి తెలంగాణలోనే కాకుండా, సీమాంధ్రలో కూడా ఇతర ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారని సీఎం లెక్కలతో వివరించారు. అప్పట్లో దీనికోసం ఒక కమిటీ వేశారని ఆ కమిటీ అప్పటి ఉద్యోగులను స్థానికులుగా గుర్తిస్తూ పరిష్కారం కనుగొందని తెలిపారు. 610 జీవో విషయంలో మొత్తం 5,10,232 మంది ఉద్యోగులను సరిచూడగా 18,856 ఉద్యోగాల్లో స్థానికేతర ఉద్యోగులు ఉన్నట్టు అధికారులు గుర్తించారని సీఎం తెలిపారు. వీరిలో తెలంగాణ ప్రాంతానికి చెందిన ఇతర జిల్లాల వారు కూడా ఉన్నారని ఆయన పేర్కొన్నారు.

వీరిలో రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం మినహాయింపు ఉన్నవారు 4,062 మంది ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. ఇందులో 14,794 రీపేట్రేషణ్ ఆర్డర్స్ ఉన్నవారని తెలిపారు. ఇక మిగిలింది కేవలం 10 ఉద్యోగాలకు మాత్రమే ఉల్లంఘనలు జరిగాయని తేల్చేశారు. అయితే ఆ 14,749 ఉద్యోగాల్లో రెండు డిపార్ట్ మెంట్ల నుంచి ఉద్యోగులపై పూర్తి సమాచారం రావాల్సి ఉందని, సమాచారం తెలపాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వివరించారు. వారిలో 32 మంది ఉద్యోగులు సుప్రీంకోర్టుకు వెళ్లారని ఆయన తెలిపారు. ఇదీ 610 జీవో పరిస్థితి అని" ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News