: రాష్ట్ర విభజన గురించి ఆనాడు ఇందిరాగాంధీ ఏం చెప్పారంటే..: సీఎం కిరణ్


శాసనసభలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన ప్రసంగాన్ని కొనసాగిస్తున్నారు. కృష్ణా, గోదావరి నదులు ఒకే రాష్ట్రంలో ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని ఇందిరాగాంధీ ఆనాడే చెప్పారని సీఎం అన్నారు. రాష్ట్రం విడిపోవాలని అనుకున్నప్పుడు అనేక అంశాలను దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. ఉద్వేగ వాతావరణంలో నిర్ణయాలు తీసుకోరాదని కూడా ఆనాడు ఇందిరాగాంధీ చెప్పిన పలు విషయాలను ఆయన సభ్యులకు గుర్తు చేశారు.

"రాష్ట్రం గురించి 1972వ సంవత్సరం డిసెంబరు 21న పార్లమెంటులో ఇందిరాగాంధీ మాట్లాడారు. అప్పట్లో నిజాం పాలన బాగున్నా, ఇక్కడి వారికి విద్యావకాశాలు సరిగా లేవని కూడా ఇందిర చెప్పారు. రాష్ట్ర విభజన చేస్తే మరిన్ని సమస్యలు వస్తాయని ఇందిర ఆనాడే చెప్పారు. తెలంగాణ వెనుకబడ్డ ప్రాంతమే అయినా.. శ్రీకాకుళం, విజయనగరంలతో పోలిస్తే తెలంగాణ ముందంజలోనే ఉందని ఇందిరాగాంధీ చెప్పారు. అయితే, వెనుకబాటుతనం ఆధారంగా.. ప్రాంతాలను విభజించడం సరికాదని కూడా ఇందిరాగాంధీ చెప్పారు. విభజన వల్లే సమస్యలు పరిష్కారమవుతాయనుకొంటే పొరపాటని కూడా ఆమె తెలిపారు" ఇలా ఇందిరా గాంధీ చెప్పిన అనేక అంశాలను సీఎం కిరణ్ సభలో ప్రస్తావిస్తున్నారు.

  • Loading...

More Telugu News