: నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ భూముల ఆక్రమణల తొలగింపు ఉద్రిక్తం


ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ (ఎన్.ఎస్.పి) ఎడమ కాలువ భూములను ఆక్రమించి నిర్మించిన పక్కా ఇళ్ళను తొలగించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. హైకోర్టు ఆదేశంతో సుమారు 200 మందితో కూడిన పోలీస్ దళాల రక్షణ మధ్య రెవెన్యూ శాఖ అధికారులు ఈ అక్రమ నిర్మాణాలను తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానికులు తీవ్ర నిరసన వ్యక్తం చేసినా.. పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని తరువాత విడిచిపెట్టారు. ఎన్.ఎస్.పికి చెందిన 1200 ఎకరాల కాలువ భూమి ఆక్రమణకు గురైందని రెవెన్యూ సిబ్బంది తెలిపారు. ఈ భూముల ప్రస్తుత మార్కెట్ విలువ రూ. 150 కోట్ల నుంచి 200 కోట్లు ఉండవచ్చని తెలుస్తోంది. ఆక్రమణల తొలగింపు కార్యక్రమాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ సురేంద్ర మోహన్, ఎస్పీ రంగనాథ్, ఖమ్మం డీఎస్పీ బాలకృష్ణ తదితర ఉన్నతాధికారులు పర్యవేక్షించారు.

  • Loading...

More Telugu News