: ప్రజలంతా ఇళ్లలోనే ఉండిపోవాలి.. బయటికి రావద్దు: అమెరికాలో హెచ్చరిక


అమెరికాను మంచు తుపాను వణికిస్తోంది. అమెరికా ఈశాన్య ప్రాంతంలో మంచుతుపాను వచ్చింది. దీని తాకిడికి పాఠశాలలు, కార్యాలయాలు మూతపడ్డాయి. 3000 విమాన సర్వీసులు రద్దయ్యాయి. మంచుతో కూడిన గాలులు బలంగా వీస్తుండడంతో తుపాను ప్రభావం తీవ్రంగా ఉంది. దీంతో ఈశాన్య రాష్ట్రాల్లో అత్యవసర స్థితి ప్రకటించారు. ప్రజలు ఇళ్లలోనే ఉండిపోవాలని.. చలి అధికంగా ఉన్నందున ప్రజలు మరణించే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వైట్ హౌస్ నిర్వహించతలపెట్టిన సమావేశాన్ని కూడా ప్రభుత్వం రద్దు చేసింది.

  • Loading...

More Telugu News