: చేతులు ముడుచుకున్నామనుకోకండి..ఏకతాటిపై నిలబడ్డాం: ఉండవల్లి హెచ్చరిక
విభజన పేరిట శిక్ష విధించాలని చూస్తే చేతులు ముడుచుకుని కూర్చుంటామని అనుకోకండని ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కాంగ్రెస్ అధిష్ఠానాన్ని హెచ్చరించారు. రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ, గతంలో విభజన వాదన చేసిన తెలంగాణ నేతలు కూడా తమ వాదనను అంగీకరిస్తున్నారని స్పష్టం చేశారు. త్వరలో వారు కూడా తమతో కలసివచ్చే అవకాశం ఉందని తెలిపారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వాస్తవ లెక్కలు, ఆధారాలతో శాసనసభలో మాట్లాడనున్నారని, తాను ఆ ప్రసంగం ప్రతులను చూశానని అన్నారు. అబద్ధాలపై నిర్మితమైన తెలంగాణ వాదనను తప్పని నిరూపించేందుకు తామంతా ఏకతాటిపై నిలబడ్డామని ఆయన స్పష్టం చేశారు.