: విశాఖ ఎక్స్‌ప్రెస్‌కు అదనంగా స్లీపర్ కోచ్


దక్షిణ మధ్య రైల్వే అధికారులు విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలుకు అదనంగా ఒక స్లీపర్ క్లాస్ కోచ్‌ను తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. దీని ద్వారా అదనంగా 1,584 బెర్తులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికుల రద్దీకి దీటుగా, అలాగే వెయిటింగ్ లిస్టులో ఉన్న ప్రయాణికుల సౌకర్యార్ధం అధికారులు ఈ ఏర్పాటు చేశారు. రైలు నెంబర్ 17016 సికింద్రాబాద్-భువనేశ్వర్ విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలుకు ఈ నెల 21 నుంచి 31 వరకు అదనంగా స్లీపర్ కోచ్‌ను జోడిస్తారు. అలాగే రైలు నెంబర్ 17015 భువనేశ్వర్- సికింద్రాబాద్ విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలుకు ఈ నెల 23 నుంచి ఫిబ్రవరి రెండో తేదీ వరకు అదనంగా స్లీపర్ కోచ్‌ను జోడిస్తారు.

  • Loading...

More Telugu News