: నాలుగు వికెట్లు కోల్పోయిన టీమిండియా
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో వన్డేలో భారత జట్టు 206 పరుగులకు కీలకమైన నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తొలి వన్డేలో రాణించిన కోహ్లీ(78) మరో సారి రాణించాడు. కీలక సమయంలో కోహ్లీ నిష్క్రమించడంతో టీమిండియా 52 బంతుల్లో 91 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజులో రైనా(22), ధోనీ(29) ఉన్నారు. రహానే(36), రోహిత్(20), ధావన్(12) రాణించినప్పటికీ భారీ స్కోర్లు సాధించడంలో విఫలమయ్యారు.