: మనల్నొదిలేశారు.. వారిద్దరూ కలుసుకున్నారు: బాబూమోహన్
తెలుగు సినీ కళామతల్లి ముద్దుబిడ్డలు ఎన్టీఆర్, ఏయన్నార్ ఇద్దరూ మనల్ని వదిలి వెళ్లిపోయారని, అయితే వారిద్దరూ స్వర్గంలో ఆనందంగా కలుసుకున్నారని సినీ నటుడు, టీడీపీ నేత బాబూమోహన్ అన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో అక్కినేని పార్థివదేహాన్ని సందర్శించిన సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తనను పేరుపెట్టి అక్కినేని రెండు మూడు సార్లు పిలిచి ఉంటారని, ఎప్పుడూ 'ఏరా అందగాడా? వచ్చావా?' అని ఆప్యాయంగా పలకరించేవారని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని ఆ కుటుంబానికి దేవుడు ఇవ్వాలని ఆయన ఆకాంక్షించారు.