: ఐదుగురు అమ్మాయిలు అదృశ్యం
రాజమండ్రిలో ఐదుగురు విద్యార్థినుల అదృశ్యం కలకలం రేపుతోంది. రాజమండ్రి రాజానగరం పరిధిలోని మూడు ప్రైవేటు పాఠశాలల్లో 6, 8వ తరగతులు చదువుతున్న ఐదుగురు విద్యార్థినులు నిన్న పాఠశాలకు వెళ్లి సాయంత్రం తిరిగి ఇళ్లకు చేరలేదు. దీంతో వారి తల్లిదండ్రులు ప్రకాశ్ నగర్, బొమ్మూరు, రాజానగరం పోలీసులను ఆశ్రయించారు. అయితే పోలీసులు వీరైదుగురూ కిడ్నాప్ కి గురై ఉండరని అంటున్నారు. వీరు ఐదుగురూ మిత్రులు కావడంతో వారంతా కూడబలుక్కుని ఎక్కడికైనా వెళ్లి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. దీంతో విశాఖ, కాకినాడలకు ప్రత్యేక బృందాలు పంపించి గాలిస్తున్నారు.