: రాజకీయాల్లో ఐటమ్ గర్ల్.. ఆమ్ ఆద్మీ: చేతన్ భగత్


అంతర్జాతీయంగా పేరొందిన ప్రముఖ యువ రచయిత చేతన్ భగత్ ఆమ్ ఆద్మీ పార్టీని రాజకీయాల్లో ఒక ఐటమ్ గర్ల్ గా అభివర్ణించారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చేతన్ భగత్ బలమైన మద్దతుదారు. కానీ, ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కేజ్రీవాల్ అలా ధర్నాకు దిగడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. కేజ్రీవాల్, ఆయన మంత్రివర్గ సహచరులు రెండు రోజుల పాటు చేసిన ధర్నా చూసి సిగ్గుపడుతున్నానని చేతన్ చెప్పారు. ఈ మేరకు ఆయన ఎన్డీటీవీతో మాట్లాడారు.

వారి ధర్నాతో ఢిల్లీ స్తంభించి పోయిందన్నారు. వ్యాపార సెంటిమెంటుపై ప్రభావం చూపిందని పేర్కొన్నారు. 'వారు లో్క్ సభ ఎన్నికల్లోకి వచ్చేయాలనే ఆత్రుతతో ఉన్నారు. అందుకోసం ఇప్పటికిప్పుడు ప్రజల దృష్టిని ఆకర్షించాలని కోరుకుంటున్నారు. అదెలా అంటే బాలీవుడ్ లో ఒక నటి ఏమీ చేయలేని స్థితిలో ఐటమ్ గర్ల్ గా మారిపోతుంది. అలానే రాజకీయాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఐటమ్ గర్ల్ లా మారిపోయింది' అని చేతన్ విమర్శించారు.

  • Loading...

More Telugu News