: అక్కినేని ట్రెండ్ సెట్టర్!


తెలుగు సినీ కళామతల్లి ముద్దుబిడ్డ అక్కినేని నాగేశ్వరరావు ఆది నుంచి ప్రత్యేక పంథాను ఎన్నుకుని వెళ్లారు. ఏనాడు ట్రెండ్ లో పడి కొట్టుకుపోలేదు. ఆయన ఓ ప్రత్యేక ఒరవడిని సృష్టించారు. నాటక రంగంలో మహిళల కొరత తీవ్రంగా ఉన్న రోజుల్లో ఆయన రంగప్రవేశం చేశారు. గంభీరమైన వాచకంతో రంగస్థలాన్ని అందరూ ఏలుతున్న రోజుల్లో ఆయన మహిళా వేషాలతో ప్రేక్షుకులను రంజింపజేశారు.

పౌరాణికాలు, పురాణ గాథలు రాజ్యమేలుతున్న రోజుల్లో ఆయన సాంఘిక నటుడిగా అశేష ఆంధ్రులను అలరించారు. తొలి తరం సినిమాల్లో మగాడు గంభీరంగా సాంఘిక సంక్షేమానికి పాటుపడడానికి రూపుదిద్దుకుంటే, అక్కినేని ఒక్కడే అమ్మాయిల వెంటపడి ప్రేమపాఠాలు నేర్పించాడు. 'నాట్యం మహిళల హక్కు, మగాడు వారిని అనుసరించడమే' అనే భారతీయ సంప్రదాయానికి చెక్ చెప్పింది అక్కినేనే కావడం విశేషం.

'చెంగావి రంగు చీర...' అంటూ డాన్సులతో అదరగొట్టి, సినీ రంగం గతి మార్చి, ఆ తరం హీరోలతో స్టెప్పులేయించారు. 'సీతారామయ్య గారి మనవరాలు' సినిమాలోని పాత్రతో కొత్తదనానికి నాంది పలికారు. ఇలా ట్రెండ్ కు అందకుండా ఆయన సరికొత్త ట్రెండ్ కి రూపకల్పన చేసి, తరువాతి తరం నటీనటులందరికీ ఆదర్శప్రాయుడయ్యారు.

  • Loading...

More Telugu News