: అక్కినేనికి మోడీ నివాళి
సినీ పరిశ్రమకు అక్కినేని నాగేశ్వరరావు చేసిన సేవ అమోఘమైనదని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ట్విట్టర్లో పేర్కొన్నారు. భారత సినీ పరిశ్రమలో ప్రఖ్యాతిగాంచిన వారిలో అక్కినేని ఒకరని కొనియాడారు. ఆయన మృతి చెందారన్న వార్త ఎంతో బాధాకరంగా ఉందని... ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు.