: ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతుదారులపై ఎఫ్ఐఆర్
ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతుదారులపై ఢిల్లీ పోలీసులు పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఢిల్లీ సెంట్రల్ రైల్వే భవన్ లో రెండు రోజుల పాటు ధర్నా చేసిన సమయంలో పోలీసులు విధించిన నిషేధాజ్ఞలు ఉల్లంఘించడంతో సెక్షన్ 144 కింద ఈ చర్యలు తీసుకున్నారు. అయితే, ఇందులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేరును పేర్కొనలేదు.