: ప్రభుత్వాన్ని కాపాడే పార్టీలివి: బాబు


అవిశ్వాస తీర్మానం విషయంలో అసెంబ్లీలో భంగపడిన పార్టీలు ప్రభుత్వాన్ని కాపాడడానికే ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. దీంతో, ప్రజా సమస్యలపై చర్చ పక్కదారి పట్టి, ప్రభుత్వ నిర్వాకాలు వెలుగులోకి రాకుండా పోతున్నాయని ఆయన దుయ్యబట్టారు. బాబు ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో పాదయాత్ర నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్, వైఎస్సార్సీపీ వైఖరిపై మండి పడ్డారు. అవిశ్వాస తీర్మానం ఎప్పుడు ప్రవేశపెట్టాలో తెలియని పార్టీలు కూడా అసెంబ్లీలో అవిశ్వాసం పెట్టి దెబ్బతిన్నాయని ఆయన ఎద్దేవా చేశారు. ఇక వైఎస్ గురించి మాట్లాడుతూ, అధికారాన్ని అడ్డుపెట్టుకుని కుమారుడికి లక్ష కోట్లు దోచి పెట్టారని ఆరోపించారు. ఆయన హయాంలో పనిచేసిన అధికారులు నేడు జైలుకెళ్లారని చెప్పారు.  

  • Loading...

More Telugu News