: అన్నపూర్ణ స్టూడియోస్ కి అక్కినేని పార్థివ దేహం తరలింపు
దివంగత అక్కినేని నాగేశ్వరరావు పార్థివ దేహాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ కి తరలించారు. ఆయన నివాసం నుంచి ప్రత్యేక వాహనంలో అక్కినేని భౌతికకాయాన్ని తరలించారు. ఈ ఉదయం 9.30 గంటల నుంచి సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానుల సందర్శన కోసం ఆయన భౌతికకాయాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ లో ఉంచుతారు.