: అక్కినేని మృతికి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు సంతాపం
నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు మృతి పట్ల ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఆయన మృతి సినీ పరిశ్రమకు, తెలుగు ప్రజానీకానికి తీరని లోటని చంద్రబాబు అన్నారు. కళారంగానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.