: కేజ్రీవాల్ ధర్నా విరమణ
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ధర్నా విరమించారు. ఢిల్లీలో మెట్రోరైల్ భవన్ వద్ద ఆయన తన పరివారంతో ధర్నాకు దిగడంతో ప్రజారవాణాకు తీవ్ర ఆటంకం కలిగింది. దేశ రాజధానిలో సాక్షాత్తూ ముఖ్యమంత్రి ధర్నాకు దిగడంతో పలు రంగాల మేధావులు పెదవి విరిచారు. అయినప్పటికీ కేజ్రీవాల్ ధర్నా విరమించకపోవడంతో కేంద్రం దిగి వచ్చింది. నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ కేజ్రీవాల్ ఆరోపిస్తున్న పోలీసు అధికారులను దీర్ఘకాలిక సెలవుపై వెళ్లాలని కోరారు. దీంతో కేజ్రీవాల్ ధర్నా విరమించారు.