: హైదరాబాదులో ఆటో ఛార్జీలు పెరుగుతున్నాయ్!
హైదరాబాదు నగరంలో మీటర్ల ఛార్జీలు పెంచాలంటూ ఆటో వాలాలు సమ్మె చేస్తున్న విషయం విదితమే. ఆటో యూనియన్ సంఘాలతో రవాణా శాఖ కమిషనర్ జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఆటో డ్రైవర్ల న్యాయమైన డిమాండ్లను ఆర్టీఏ కమిషనర్ అంగీకరించడంతో వారు సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు. జంటనగరాల పరిధిలోని ఆటో మీటరు ఛార్జీలు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి పెరుగుతున్నాయి. ఇప్పటివరకూ ఉన్న కనీస ఛార్జీని 16 నుంచి 20 రూపాయలకు పెంచేందుకు ఆర్టీఏ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే కిలోమీటరుకి ఉన్న ఛార్జీలను కూడా అందుకు అనుగుణంగా సవరించింది. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన సందర్భంలో ఉన్న జరిమానాను వెయ్యి రూపాయల నుంచి వంద రూపాయలకు తగ్గించేందుకు కూడా ఆర్టీఏ కమిషనర్ అంగీకరించారు.