: లోక్ సత్తా కార్యాలయంపై కోడిగుడ్లు విసిరిన సమైక్యాంధ్ర విద్యార్థులు
హైదరాబాదు, బంజారా హిల్స్ లోని లోక్ సత్తా కార్యాలయంపై సమైక్యాంధ్ర జేఏసీ విద్యార్థులు కోడిగుడ్లు విసిరారు. అనంతరం కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించి, ఆందోళన చేపట్టారు. వెంటనే పోలీసులు వారిని అరెస్టు చేసి మంగళ్ హాట్ స్టేషన్ కు తరలించారు. రెండు రోజుల కిందట శాసనసభలో విభజన ముసాయిదా బిల్లుపై జయప్రకాశ్ నారాయణ ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజన అనివార్యం, తెలంగాణ ఏర్పాటు అవసరమన్న జేపీ వ్యాఖ్యలకు నిరసనగానే దాడికి యత్నించినట్లు సమాచారం.