: ఐశ్వర్య స్థానంలో కత్రిన!


అందాల భామ కత్రినా కైఫ్ ప్రముఖ కాస్మెటిక్ బ్రాండ్ 'లోరియల్ పారిస్' కు భారతదేశం తరపున అంబాసిడర్ గా ఎంపికైంది. ముంబైలో ఈ మేరకు నిర్వహించిన కార్యక్రమంలో ఆ సంస్థ తెలిపింది. త్వరలోనే ఆమెతో కొన్ని వాణిజ్య ప్రకటనలు చిత్రీకరించి విడుదల చేయనున్నారు. ఇంతకుముందు ఈ ఉత్పత్తికి ఐశ్వర్యా రాయ్ బచ్చన్, సోనమ్ కపూర్, ఫ్రిదా పింటో లోరియల్ కు అంబాసిండర్ లుగా ఉన్నారు. వీరిలో ఐశ్వర్య దాదాపు పన్నెండేళ్ల పాటు అంబాసిడర్ గా కొనసాగింది. ఈ సందర్భంగా మాట్లాడిన కత్రిన, సంతోషం వ్యక్తం చేసింది. అనంతరం మాట్లాడిన ఐశ్వర్య... లోరియల్ పారిస్ కుటుంబంలోకి హృదయ పూర్వకంగా కత్రినను ఆహ్వానిస్తున్నానని తెలిపింది.

  • Loading...

More Telugu News