: సత్తా చూపిన హైదరాబాదీ..10 ఓవర్లు..3 మెయిడెన్లు..4 వికెట్లు
వీసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరుగుతున్న మహిళల రెండో వన్డేలో హైదరాబాదీ యువతి గౌహర్ సుల్తానా సత్తా చూపింది. పది ఓవర్లు బౌలింగ్ చేసి మూడు మెయిడెన్ ఓవర్లు వేసి కేవలం 15 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీసుకుంది. దీంతో మూడు వన్డేల సిరీస్ ను 2-0 తేడాతో టీమిండియా గెల్చుకుంది. టాస్ గెలిచిన భారత మహిళా క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ ప్రాంరభించిన శ్రీలంక జట్టు 47.1 ఓవర్లలో 140 పరుగులు చేసి ఆలౌటైంది. 141 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన టీమిండియా 39.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసి సిరీస్ గెల్చుకుంది. భారత బ్యాట్స్ ఉమన్ లో మంధన(51), రౌత్(38), మిథాలీ రాజ్(31) లు రాణించారు.