: సాయంత్రం లోపు అనుమతి వస్తుంది: అశోక్ బాబు


రేపు తాము చేపట్టనున్న ధర్నాకు సాయంత్రం లోపు అనుమతి వస్తుందని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ డీజీపీ ఇంకా అనుమతి ఇవ్వలేదని, తాము చేపట్టే ధర్నాపై అపోహలు ఉన్నాయని అన్నారు. తాము తలపెట్టనున్నది ఛలో హైదరాబాద్ కాదని, ఇందిరా పార్కు వద్ద ధర్నా అని తెలిపారు. ఈ ధర్నాలో సుమారు 5 వేల మంది ఉద్యోగులు పాల్గొనే అవకాశం ఉందని అన్నారు. 'బీజేపీ తెలంగాణకు మద్దతిచ్చామని చెబుతోంది.. కానీ బిల్లుకు కాదన్న విషయాన్ని అందరూ గుర్తించాల'ని ఆయన కోరారు.

  • Loading...

More Telugu News