: బిల్లుపై చర్చించినా, చర్చించకున్నా ఫరక్ పడదు: మోత్కుపల్లి


శాసనసభలో తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చించినా, చర్చించకున్నా ఫరక్ పడదని (ఒనగూరే ప్రయోజనం) టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ, బిల్లును రాష్ట్రపతి పంపించి 40 రోజులు అయిందని, ఇంత వరకు జరిగిన చర్చ చాలని అన్నారు. తక్షణం బిల్లును రాష్ట్రపతికి పంపించాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం శాసనసభను వాయిదా వేస్తున్నట్టు డిప్యూటీ స్పీకర్ ప్రకటించారు. రేపు ఉదయం 9 గంటలకు సభ తిరిగి ప్రారంభం అవుతుంది.

  • Loading...

More Telugu News