: ఢిల్లీలో ఆప్ కి, పోలీసులకి మధ్య వార్
ఢిల్లీ ప్రభుత్వానికి, పోలీసులకి మధ్య వార్ ఆసక్తికరంగా సాగుతోంది. పోలీసుల తీరుకు నిరసనగా సాక్షాత్తూ ముఖ్యమంత్రి ధర్నాకు దిగితే.. స్థలం ఖాళీ చేయాలని పోలీసులు ముఖ్యమంత్రికి అల్టిమేటం జారీ చేశారు. ధర్నాను రాత్రనక, పగలనక కొనసాగించిన ఢిల్లీ ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో వారు ఆగ్రహించి బారికేడ్లు ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. ఈ ఘటనలో నలుగురు ఆప్ కార్యకర్తలు గాయపడ్డారు. దీంతో ఆప్ కార్యకర్తలు పోలీసులపై రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో పలువురు పోలీసులు గాయపడ్డారు.