: అమరవీరుల్లో ఒక్క టీఆర్ఎస్ కార్యకర్త అయినా ఉన్నాడా?: ఎర్రబెల్లి
తెలంగాణను ప్రకటిస్తే టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తానని కేసీఆర్ చెప్పిన విషయాన్ని ఆ పార్టీ నేతలు గుర్తుకు తెచ్చుకోవాలని టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ఆ పార్టీ నేతలకు సూచించారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ, సభలో టీబిల్లుకు అందరి మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నించాలే కానీ, రెచ్చగొట్టరాదని అన్నారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన వారంతా నిజమైన తెలంగాణ అభిమానులని, వారిలో ఒక్క టీఆర్ఎస్ కార్యకర్త అయినా ఉన్నారా? అంటూ ప్రశ్నించారు.