: ఆస్ట్రేలియా ఓపెన్ లో సానియా జంట ఓటమి
మెల్ బోర్న్ లో జరుగుతున్న ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల డబుల్స్ లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా జంట ఇంటిముఖం పట్టింది. జింబాబ్వేకి చెందిన కారా బ్లాక్ తో కలసి ఆడిన సానియా... క్వార్టర్ ఫైనల్లో ఇటలీకి చెందిన సారా ఇరానీ, రాబర్టా విన్సీతో తలపడింది. అయితే టాప్ సీడ్ గా బరిలోకి దిగిన ఇటలీ జోడితో 2-6, 6-3, 4-6 తో సానియా జోడి ఓటమిపాలయింది. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ మ్యాచ్ లో సానియా జోడి చివరి సెట్లో 4-2 తేడాతో మెరుగైన స్థితిలో ఉన్నప్పటికీ, ఇటలీ జంట ముందు నిలవలేకపోయింది.