: వైఫల్యం కప్పిపుచ్చుకోవడానికే కేజ్రీవాల్ ధర్నా: ఏఏపీ రెబెల్ ఎమ్మెల్యే
ఢిల్లీలో ధర్నా చేపట్టిన ఏఏపీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పై ఆమ్ ఆద్మీ తిరుగుబాటు ఎమ్మెల్యే వినోద్ బిన్నీ మరోసారి విమర్శలు గుప్పించారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో ఫెయిలైన కేజ్రీవాల్... తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే ధర్నాకు దిగారని చెప్పారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కేజ్రీవాల్ ఇలాంటి కార్యక్రమాలకు పూనుకున్నారని విమర్శించారు.