: భారత క్రికెటర్లు సత్తా చాటేందుకు అవకాశం: రాస్ టేలర్
భారత జట్టు తిరిగి సత్తా చాటేందుకు చక్కటి అవకాశం ఉందని న్యూజిలాండ్ స్టార్ బ్యాట్స్ మెన్ రాస్ టేలర్ అన్నాడు. బుధవారం జరిగే మ్యాచ్ వేదిక హామిల్టన్ లో వారికి అనువైన వాతావరణ పరిస్థితులున్నాయని అభిప్రాయపడ్డాడు. మిగిలిన మ్యాచ్ లు ఆషామాషీ ఏం కాదన్నాడు. తొలి వన్డేలో తాము అన్ని విధాలుగా రాణించడం వల్లే విజయం సాధ్యమైందని చెప్పాడు. కానీ, భారత జట్టు ప్రపంచ చాంపియన్ అని వారికి చక్కటి అవకాశం ఉందని టేలర్ ఒక ప్రొఫెషనల్ గా మాట్లాడాడు.