: చంద్రబాబుకి జగన్ అంటే భయం: భూమా నాగిరెడ్డి
మళ్లీ ముఖ్యమంత్రి అవ్వాలని
తపించిపోతోన్న టీడీపీ అధినేత చంద్రబాబుకి జగన్ భయం పట్టుకుందని వైఎస్ ఆర్
కాంగ్రెస్ పార్టీ నేత భూమా నాగిరెడ్డి విమర్శించారు. అందుకోసమే బాబు, ప్రభుత్వం మీద ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వలేదని
ఆరోపించారు. ప్రభుత్వం పడిపోతే జగన్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి, జగన్
ముఖ్యమంత్రి అవటం ఖాయమని తెలిసే చంద్రబాబు కాంగ్రెస్ సర్కారుని
కాపాడారన్నారు. కర్నూల్ జిల్లా వైఎస్ ఆర్ సీపీ కార్యకర్తల సమావేశంలో భూమన ఈ
వ్యాఖ్యలు చేశారు.