: తమిళనాడులో మహిళా ప్రొఫెసర్ దారుణ హత్య


తమిళనాడు ఈరోడ్ లోని ఓ కాలేజ్ లో పనిచేస్తున్న మహిళా ప్రొఫెసర్ (30) దారుణ హత్యకు గురైంది. ఆమె ఇంట్లో పనిచేస్తున్న పని మనిషి ఈ ఉదయం మృత దేహాన్ని గుర్తించింది. వెంటనే ఇరుగు పొరుగు వారి సహాయంతో ఈ విషయాన్ని పని మనిషి పోలీసులకు చేరవేసింది. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మహిళా ప్రొఫెసర్ భర్త మెడికల్ రెప్రెజెంటేటివ్ గా పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు. అయితే, దారుణ హత్యకు గురైన మహిళ ఒంటిపై ఉన్న బంగారం కూడా అలాగే ఉంది. దీంతో ఈ హత్య ఓ మిస్టరీగా మారింది. ఉద్యోగరీత్యా టూర్ లో ఉన్న ఆమె భర్తను విచారించాల్సిన అవసరం ఉందని పోలీసులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News