: పది జిల్లాల తెలంగాణలో హిందుత్వ శక్తులు పుంజుకుంటాయి: అక్బరుద్దీన్
పది జిల్లాల తెలంగాణలో హిందుత్వ శక్తులు మరింత పుంజుకుంటాయని ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ ఆందోళన వ్యక్తం చేశారు. గడచిన నాలుగేళ్లలో సంఘ్ పరివార్ చేపట్టిన నిరసనలు, ధర్నాలే దీనికి నిదర్శనమని చెప్పారు. అందుకే తాము తెలంగాణను కాకుండా, రాయల తెలంగాణను ప్రతిపాదించామని చెప్పారు. అయితే తమ అభిప్రాయాలను జీవోఎం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభలో ప్రసంగిస్తూ అక్బర్ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఏర్పడితే ముస్లింలు మరింతగా నష్టపోతారని అభిప్రాయపడ్డారు. ప్రాంతీయ బోర్డులు ఏర్పాటు చేసినా... వాటి వల్ల ఉపయోగం ఉండదని తెలిపారు.